ఆనుకొనుట


  • అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
    నిర్గమకాండము 33:14
  • ఊరి చివరకు వచ్చు చుండగా సమూయేలు సౌలుతోమనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను.
    సమూయేలు మొదటి గ్రంథము 9:27
  • అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధ ములను అమర్చుదము. కాగావారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.
    దినవృత్తాంతములు రెండవ గ్రంథము 14:7
  • భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
    కీర్తనల గ్రంథము 4:4
  • ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
    కీర్తనల గ్రంథము 27:14
  • యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
    కీర్తనల గ్రంథము 37:7
  • యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
    కీర్తనల గ్రంథము 40:1
  • ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
    కీర్తనల గ్రంథము 46:10
  • నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
    కీర్తనల గ్రంథము 55:22
  • జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమి్మక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)
    కీర్తనల గ్రంథము 62:8
  • ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
    యెషయా గ్రంథము 26:3
  • ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప బడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.
    యెషయా గ్రంథము 30:15
  • నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
    యెషయా గ్రంథము 32:17
  • యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
    యెషయా గ్రంథము 40:31
  • యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
    యిర్మీయా 17:7
  • నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
    యిర్మీయా 29:11
  • ​ తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
    విలాపవాక్యములు 3:25, 26
  • ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
    మత్తయి సువార్త 11:28-30
  • అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
    ఫిలిప్పీయులకు 4:7
  • అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
    2 తిమోతికి 1:12
  • ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
    1 పేతురు 5:7